ఇంట్లోనే ఉరివేసుకొని మృతి
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి(Dandepalli) మండలంలోని గుడిరేవు గ్రామానికి చెందిన పుసాల రాజు(king of Pusala) (36)అనే వ్యక్తి జీవితం పై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇనుప రాడ్డుకు(Iron Rod) ఉరి వేసుకుని మృతి చెందాడు. దండేపల్లి ఎస్సై తహసినోద్దీన్(Tahsinuddin), కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు రాజు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతో గత కొద్ది రోజుల నుంచి మద్యాని(Madyani)కి బానిసై ఇంట్లో తన భార్యతో తరుచు గొడవ పడడంతో అతని భార్య మూడు రోజుల క్రితం పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.
దాంతో రాజు జీవితం పై విరక్తి చెంది ఈ రోజు ఉదయం ఇంట్లో ఇనుప రాడ్డుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని తల్లి పుసాల లక్ష్మీ(Pusala Lakshmi) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తహసినోద్దీన్ తెలిపారు.