వరికోత మిషన్‌లో చేతులు…

కొత్తగూడ, (ఆంధ్రప్రభ) : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పొగులపల్లి గ్రామానికి చెందిన రైతు గాజుల అశోక్ (45) వరి కోత మిషన్‌తో కోత పనులు చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా ఆయన రెండు చేతులు మిషన్‌లో చిక్కుకోవడంతో తీవ్రంగా గాయపడి పూర్తిగా విరిగిపోయాయి. విషయం తెలిసిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించడంతో అశోక్‌ను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు.
