హంద్రీనీవా ద్వారా చెరువుకు నీరు అందించేలా ప్రణాళికలు

హంద్రీనీవా ద్వారా చెరువుకు నీరు అందించేలా ప్రణాళికలు

రాప్తాడు, ఆంధ్రప్రభ : గతంలో వర్షాలు వచ్చినప్పుడు చెరువు తెగిపోయి చాలా నష్టం వాటిల్లిందని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్పారు. మరోవైపు హంద్రీనీవా కాలువ నుంచి చెరువుకు నీరు అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కనగానపల్లి మండల కేంద్రంలోని రెడ్డి వారి కుంట చెరువు మరమత్తు పనులు నెలలోగా పూర్తిచేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆదేశించారు.

ఆదివారం చెరువు మరమ్మత్తు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. 2024లో అక్టోబర్ 21న కురిసిన అతి భారీ వర్షాలకు ఈ చెరువు తెగిపోగా చెరువు మరమ్మతులకు డీఎంఎఫ్ గ్రాంట్ రూ.86లక్షలు మంజూరు చేయించారు. ఇందుకు సంబంధించిన పనులను మార్చి 17న ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రస్తుతం పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు.

ఇప్పటికే 30 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు. మిగిలిన పనులు కూడా నెలలోపు పూర్తి చేయాలని అన్నారు. అలాగే పనులు నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దన్నారు. కట్ట నిర్మాణం రివిటింగ్ లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తూముల రిపేరీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రూ.9.5 లక్షలతో ఈ పనులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. ఆ పనులు కూడా పూర్తి చేస్తే చెరువుకు నీరు ప్రతి ఏటా అందుతుందన్నారు.

Leave a Reply