చోరీ సొత్తు స‌గం రిక‌వ‌రీ.. బాధితుడికి అప్ప‌గింత‌

చోరీ సొత్తు స‌గం రిక‌వ‌రీ.. బాధితుడికి అప్ప‌గింత‌

తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : మూడేళ్ల క్రితం జరిగిన భారీ బంగారం చోరీ కేసు (gold theft case) లో జిల్లా పోలీసులు పురోగతిని సాధించారు. అంతర్‌ రాష్ట్ర ముఠాకు చెందిన దొంగ నుంచి చోరీ సొత్తులో సగం రికవరీ చేశారు. కోర్టు ద్వారా బాధితుడికి అంద‌జేశారు. మూడేళ్ల క్రితం జరిగిన చోరీలో పురోగతి సాధించడం చర్చనీయాంశంగా మారింది.

తాండూరు మండలం మల్కాపూర్‌ గ్రామ సమీపంలోని ది ఇండియా సిమెంట్ కర్మాగారంలో పొద్దుటూరుకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి పనిచేశారు. 2022 డిసెంబర్ నెలాఖరులో ఆయన ఇంట్లో చోరీ జ‌రిగింది. ఇంట్లో ఉన్న నగదుతో పాటు 65 తులాల బంగారాన్ని ఎత్తుకుపోయారు. అప్పట్లో అడిషనల్ ఎస్పీ రషీద్ విచారణ చేపట్టారు. ఈ దొంగతనానికి పాల్పడింది అంతర్‌ రాష్ట్ర ముఠాగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ముఠాకు చెందిన ఓ దొంగ నుంచి 23 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు.

కోర్టు ద్వారా నిందితుడికి రికవరీ చేసిన బంగారం 23 తులాలను తిరిగి అప్ప‌గించార‌ని తెలిపారు. మిగతా ముఠా సభ్యులను గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే నిందితులును పట్టుకుని పూర్తి బంగారాన్ని రికవరీ చేస్తామని తెలిపారు.

Leave a Reply