Hajj | సౌదీలో ప్రమాదం కలచివేసింది

Hajj ! ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన పలువురు మృత్యువుకు లోనవ్వడం పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాదం తనను కలచివేసిందన్నారు. హజ్ యాత్రలో భాగంగా మక్కా నుంచి మదీనా వెళుతున్న బస్సు ప్రమాదానికి గురై 40 మందికి పైగా అకాల మృతి చెందడం, అందులో 16 మంది యాత్రీకులు తెలంగాణ వాసులు కావడం తీవ్ర బాధాకరమని తన సంతాప సందేశంలో ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మృతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందేలా సౌదీ ప్రభుత్వంతో సమన్వయ చర్యలు చేపట్టవలసిందిగా ఎంపీ రవిచంద్ర కేంద్ర ప్రభుత్వానికి సలహానిచ్చారు.మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఎంపీ వద్దిరాజు భగవంతున్ని ప్రార్థించారు,వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
