ఘనంగా గోదావరి మాతకు హారతి

ఘనంగా గోదావరి మాతకు హారతి

ధర్మపురి. ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం వలె కార్తీకమాసం సందర్భంగా ప్రతినిత్యం గోదావరి మాతకు హారతి కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్తీకమాసం ఐదో రోజు సందర్భంగా గోదావరి మాతకు ఈ రోజు ఘనంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. వివిధ రకాల హారతులతో గోదావరి మాతకు హారతులు ఇచ్చారు.

గోదావరి వద్ద ప్రత్యేక పూజల అనంతరం హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ ధర్మకర్తలు వేద పండితులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply