Guntur | వివేకానంద జీవితం మార్గదర్శకం

Guntur | వివేకానంద జీవితం మార్గదర్శకం

  • జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా

Guntur | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : వివేకానంద జీవితం యువతకు మార్గదర్శకమ‌ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. సోమవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా క‌లెక్ట‌రేట్‌లో వేడుకలను నిర్వహించారు. వివేకానంద చిత్ర పటానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Guntur

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారత ఆధ్యాత్మిక, తాత్విక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు అన్నారు. యువతకు శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్నిఅందించిన మహోన్నత ఆలోచనావేత్త అని పేర్కొన్నారు. ” మేలుకో .. లక్ష్యాన్ని సాధించే వరకు ఆగవద్దు” అనే వివేకానందుని సూక్తి నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు. యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావం పెంపొందాల్సిన అవసరం ఉందని, దీనికి స్వామి వివేకానందుని బోధనలు పునాదిగా నిలుస్తాయని తెలిపారు. విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన జీవనమే సమాజ అభివృద్ధికి మార్గమని స్పష్టంగా చెప్పారు.


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కె.ఖాజావలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కేవీవీ సత్యనారాయణ, జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply