Gundlapalli | ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ…

Gundlapalli | ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ…
శరణు ఘోషతో మారుమోగిన గుండ్లపల్లి గ్రామం…
Gundlapalli | గన్నేరువరం, ఆంధ్రప్రభ: మండలంలోని గుండ్లపల్లి (Gundlapalli) శ్రీ రంగనాయకుల ఆలయంలో గురుస్వామి దొమ్మట భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బేతల్లి రాజేందర్ రెడ్డి స్వామి, గుండ్లపల్లి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో శనివారం మహా పడిపూజ కార్యక్రమం గురుస్వామి బాష్యం శ్రీనివాస్ చే ఘనంగా నిర్వహించారు.
తిమ్మాపూర్ (Thimmapur), చిగురు మామిడి, కోహెడ, గన్నేరువరం మండలాల్లోని వివిధ గ్రామాల అయ్యప్పలు అధిక సంఖ్యలో తరలివచ్చి పడిపూజలో పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో రంగనాయక ఆలయం (Ranganayak Temple) గుండ్లపల్లి గ్రామం మార్మోగింది. అయ్యప్ప స్వాములు ఆలపించిన గీతాలతో భక్తి పారవశ్యం నెలకొన్నది. అయ్యప్పలకు అన్నప్రసాద వితరణ , భక్తులకు సామూహిక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురు స్వామి దొమ్మాట భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బేతల్లి రాజేందర్ రెడ్డి, గుండ్లపల్లి భక్త బృందం కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన అయ్యప్ప స్వాములకు దాతలకు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
