Gunadala Maryamata | ఉత్సవాలు ముగింపు వేడుకలు..

Gunadala Maryamata | ఉత్సవాలు ముగింపు వేడుకలు..
- పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
Gunadala Maryamata | విజయవాడ, ఆంధ్రప్రభ : తమిళనాడు వేళాంగిణి మేరీమాత ఉత్సవాల తరహాలో వచ్చే ఏడాది మరింత వైభవంగా, విజయవాడ నగర శోభ మరింత పెరిగే విధంగా గుణదల మేరీమాత ఉత్సవాలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. దేశవిదేశాల్లో గుణదల మేరీమాత ఉత్సవాల గురించి చెప్పుకునే విధంగా మరిన్నీ వసతులు, సదుపాయాలు కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామన్నారు. దక్షిణ భారత దేశంలోనే ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న గుణదల మేరీమాత ఉత్సవాల ముగింపు వేడుకలు బుధవారం జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులు గా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లను బిషప్ తెలగతోటి రాజారావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా పాదర్ లకు ఎంపీ కేశినేని శివనాథ్ తృణ ధాన్యాలతో కూడిన బహుమతి అందజేశారు. అనంతరం బిషప్, పాదర్ లతో కలిసి మేరీమాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో పాల్గొని మేరీమాత ఆశీస్సులు తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

విజయవాడకు గుణదల మేరీమాత ఉత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకమమంటూ. మేరీమాత ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జిల్లా యంత్రాంగం చక్కటి ఏర్పాట్లు చేశారని అభినందించారు. దేశంలో ఎంతో పేరుగాంచిన క్రైస్తవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ది గాంచిన గుణదల మేరీమాత దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనటానికి ముందుగా మేరీమాత ఆశీస్సులు అందుకోవటం ఎంతో సంతోషంగా వుందన్నారు. మేరీమాత దివ్య ఆశీస్సులతో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వికార్ జనరల్ రెక్టర్ మువ్వల ప్రసాద్, రెక్టర్ గుణదల పుణ్యక్షేత్రం ఏలేటి విలియ్ జయరాజు, గుణదల చర్చ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎన్.విజయరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ఊర్ల మోహన్ రావు, టీడీపీ క్రిస్టియన్ నాయకులు ఇత్తడి చార్లెస్, చాట్ల రాజశేఖర్, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి చరణ్ , ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బన్ కో-ఆర్డినేటర్ వల్లభనేని నరసింహాచౌదరి,టిడిపి నాయకులు మాదిగాని గురునాధం, ఆంధ్రప్రదేశ్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు డైరెక్టర్ దయ్యాల శిరీష గాంధీ, గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పర్వతనేని రత్నశ్రీ, టిడిపి 2వ డివిజన్ ప్రెసిడెంట్ దాసరి గాబ్రియేల్, సెక్రటరీ సుగసాని కృష్ణప్రసాద్, టీడీపీ 5వ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ దేవానంద్, టీడీపీ 7వ డివిజన్ అధ్యక్షుడు పటమట సతీష్ చంద్ర, ఎమ్.ఆర్.పి.ఎస్ నాయకులు మానికొండ శ్రీధర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
