Gujarat | గిర్ అభయారణ్యంలో ప్ర‌ధాని మోడీ – వేట‌గాడి అవ‌తారంలో సంద‌ర్శన‌


చేతిలో కెమెరాతో వ‌న్య ప్రాణాల ఫోటోలు

జామ్ న‌గ‌ర్, గుజ‌రాత్ – ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గిర్ అభయారణ్యాన్ని సందర్శించారు. ఆసియా సింహాలను చూసి ఆయన ఫోటోలు తీశారు. జునాగఢ్‌లో జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో పాల్గొనే ముందు, 20.24 హెక్టార్లలో వన్యప్రాణి ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని సంద‌ర్శించారు. వన్యప్రాణి సంరక్షణకు ఇది మంచి అడుగు అని పర్యావరణ ప్రేమికులు భావిస్తున్నారు.

గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మోడీ ఈ ఉదయం జామ్‌నగర్ సర్క్యూట్ హౌస్ నుంచి నేరుగా కఛ్ జిల్లాకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఛిత్రోడ్‌కు బయలుదేరి వెళ్లారు. గిర్ అభయారణ్యాన్ని సందర్శించారు. 30,000లకు పైగా చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం గలదీ గిర్ నేషనల్ పార్క్. మొత్తం 9 జిల్లాల్లో 53 తాలూాకాలకు విస్తరించిన ఈ అటవీ ప్రాంతానికి ఆసియాటిక్ పులులు, సింహాల సంరక్షణ కేంద్రంగా గుర్తింపు ఉంది.

” సోమ్‌నాథ్ నుంచి 43, జునాగఢ్ నుంచి 60, అమ్రేలి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ గిర్ ఫారెస్ట్. ప్రతి సంవత్సరం వర్షాకాల సీజన్‌లో అంటే జూన్ 16 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు దీన్ని మూసివేస్తుంటారు. 2020 నాటి గణాంకాల ప్రకారం.. ఈ నేషనల్ పార్క్‌లో 674 వరకు సింహాలు ఉన్నాయి. ఇందులో లయన్ సఫారీ చేశారు ప్రధాని మోదీ. వేటగాడి అవతారంలో కనిపించారు. తలపై హంటింగ్ హ్యాట్, వైల్డ్ లైఫ్ జాకెట్ ధరించారు. కంప్లీట్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారాయన. చేతిలో కెమెరాతో ఓపెన్ టాప్ జీప్‌లో ట్రావెల్ చేశారు. దారిలో సింహాలను క్లిక్‌మనిపించారు. ఈ క్లిక్స్ ఇప్పుడ వైర‌ల్ గా మారాయి.

https://twitter.com/narendramodi/status/1896443509630263439

Leave a Reply