Gudivada | స్కానింగ్ సెంటర్లపై చర్యలు..

- ఓ స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ రద్దు
గుడివాడ, ఆంధ్రప్రభ : స్టేట్ పీఎస్సీ పి అండ్ డి టి యాక్ట్ అప్రీషియేట్ అథారిటీ డాక్టర్ అనిల్‌కుమార్, అదనపు డైరెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పి. యుగంధర్ బుధవారం గుడివాడలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, నాలుగు స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీల్లో గుర్తించిన లోపాల కారణంగా సంబంధిత కేంద్రాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒక స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయగా, మరో సెంటర్లో స్కానింగ్ రూమ్‌ను సీజ్ చేశారు.
సెంటర్లు వెంటనే లోపాలు సరిదిద్దాలని, అవసరమైన నివేదికలను మచిలీపట్నం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని స్కాన్ సెంటర్లు ఫారం–ఎఫ్‌ను తప్పనిసరిగా ఆన్లైన్లో సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.
