Gudivada | 23 వరకు రైల్వే గేటు మూసివేత

Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ స్టేషన్ గేట్ వద్ద ఉన్న బేతవోలు రైల్వే గేట్ లో ట్రాక్ మరమ్మత్తుల (ట్రాక్ రిపేర్స్) నిమిత్తం రైల్వే గేట్‌ను తాత్కాలికంగా 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు మూసివేయడం జరుగుతుందని గుడివాడ ట్రాఫిక్ పోలీసులు శనివారం తెలిపారు. అందువలన ఆ కాలవ్యవధిలో ఆ మార్గం గుండా వెళ్లే వాహనదారులు దయచేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవలసిందిగా కోరారు. వాహనదారులు పోలీసుల సూచనలను పాటిస్తూ, ట్రాఫిక్ అంతరాయం లేకుండా సహకరించగలరని కోరారు.
