అక్కినేని నాగేశ్వరరావు కళాశాల నందు జాబ్ మేళా..

అక్కినేని నాగేశ్వరరావు కళాశాల నందు జాబ్ మేళా..
నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ
గుడివాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను 11న బుధవారం నాడు ఉదయం 9:00 గంటలకు గుడివాడలోని అక్కినేని నాగేశ్వరరావు కళాశాల నందు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్, ఎలిగెంట్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ముక్కు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సుధీర్ టింబర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డా.పి.నరేష్ కుమార్ తెలిపారు.
ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్(మెకానికల్, సివిల్) పూర్తి చేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, మార్చ్ 11న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/ వెబ్సైట్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమెలతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్ మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 98488 19682, 79813 68429 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
