Gudivada | అభివృద్ధిపై సమీక్ష

Gudivada | అభివృద్ధిపై సమీక్ష

  • హాజ‌రైన ఎమ్మెల్యే రాము, అధికారులు

Gudivada | గుడివాడ, ఆంధ్ర‌ప్ర‌భ : గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో 70శాతం… ఎనర్జీఎస్ అభివృద్ధి పనులు పూర్తి చేశామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు. వార్షిక ఏడాదిలోపు మిగిలిన 30% పనులు పూర్తిచేసి, గుత్తేదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఆయన చెప్పారు. గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్, నందివాడ మండలాల పరిధిలోనీ గ్రామాల్లో రూ.22 కోట్ల ఎనర్జీఎస్ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తి చేసుకున్న అభివృద్ధి పనులు, నిర్మాణ దశలో ఉన్న వాటి వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.

వేగవంతంగా అభివృద్ధి పనులు జరగాలని, ఆటంకాలు తలెత్తిన, సమస్యలు ఎదురైన నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ. 22 కోట్ల ఎనర్జీఎస్ నిధులతో గ్రామాల్లో 300 వర్కులు మొదలుపెట్టామని, రూ.14కోట్లతో 70 శాతం అభివృద్ధి పనులు పూర్తిచేసి, గుత్తేదారుల ఖాతాలో నగదు జమ చేసినట్లు చెప్పారు. వార్షిక ఏడాది మార్చి లోపు మిగిలిన అభివృద్ధి పనులు కూడా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులపై, ప్రజలు తమ సహకారం అందించాలని ఎమ్మెల్యే రాము సూచించారు.

ఈ సమావేశంలో పంచాయతీరాజ్ DE రవి, AE లు సూరిబాబు, నాగేశ్వరరావు, గుడివాడ ఎండీఓ విష్ణు ప్రసాద్, తహ‌సిల్దార్ కుమార్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, నందివాడ మండల టిడిపి అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, తుమ్మలపల్లి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply