Gudihatnur | గ్రామాభివృద్ధే నా లక్ష్యం

Gudihatnur | గ్రామాభివృద్ధే నా లక్ష్యం
- సర్పంచ్ అభ్యర్థి ఆడే విజయలక్ష్మి
Gudihatnur | గుడిహథ్నూర్, ఆంధ్రప్రభ : మండలంలోని మచ్చాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని మచ్చాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఆడే విజయలక్ష్మి అన్నారు. ఇవాళ ఆమె మచ్చాపూర్ గ్రామపంచాయతీలో వాడవాడ తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
గ్రామంలో నెలకొన్న తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. తాను గెలిచిన అనంతరం గ్రామాభివృద్ధికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆమె ప్రచారంలో మహిళలు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
