GT vs MI | ఓపెన‌ర్లు అదుర్స్.. గుజ‌రాత్ ఆరంభం అధిరింది !

ఇండియ‌న్ ప్రీమియల్ లీగ్ లో భాగంగా నేడు అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడుతొంది. కాగా, ఇరు జ‌ట్లూ టోర్నమెంట్‌లో తమ తొలి విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో ముందు అడుగువేయాల‌ని పట్టుదలతో ఉన్నాయి.

ఈ క్ర‌మంలో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్ చేప‌ట్టిన టైట‌న్స్ కు అధిరే ఆరంభం ద‌క్కింది. బౌల‌ర్ల పిచ్ పై ఓపెనింగ్ బ్యాట‌ర్లు సాయి సుద‌ర్శ‌న్ (26 బంతుల్లో 39) – శుభ‌మ‌న్ గిల్ (27 బంతుల్లో 38) దంచికొట్టారు.

వీరిద్ద‌రూ క‌లిసి ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్న ఈ జోడీని కెప్టెన్ హార్దిక్ పాండ్యా విడదీశాడు. పాండ్యా బౌలింగ్‌లో నమన్ ధిర్‌కు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ వెనుదిరిగాడు. దీంతో 10 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 92 పరుగులు చేసింది గుజ‌రాత్ జ‌ట్టు.

ప్ర‌స్తుతం క్రీజులో సాయి సుదర్శన్‌తో పాటు జాస్ బట్లర్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

Leave a Reply