GT vs LSG | టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ …

ల‌క్నో – ఐపిఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి.. తొలి మ్యాచ్ గుజ‌రాత్ టైటాన్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య జ‌ర‌గ‌నుండ‌గా, మ‌రో మ్యాచ్ స‌న్ రైజ‌ర్స్ తో పంజాబ్ ఢీకొన‌నుంది. ఇక ల‌క్నోలో నేటి మ‌ధ్యాహ్నం జ‌రిగే మ్యాచ్ లో లక్నో జెయిట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మరికొద్ది సేపట్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేయనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలు చూసుకుంటే

లక్నో:
గత రెండు మ్యాచుల్లోనూ స్మాల్ మార్జిన్స్‌తో విక్టరీ కొట్టిన పంత్ సేన ఫుల్ జోష్‌లో ఉంది. బిగ్ టార్గెట్స్‌ను కాపాడుకోవడం ఆ టీమ్ హ్యూస్ ప్లస్. బౌలింగ్‌లో లార్డ్ శార్దూల్, ఆకాశ్‌దీప్, దిగ్వేశ్ అదరగొడుతున్నారు. బ్యాటింగ్‌లో పూరన్, మార్ష్, మార్క్రమ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు.

గుజరాత్:
లిమిటెడ్ రిసోర్సెస్‌తో అద్భుతాలు చేస్తోంది జీటీ. వరుసగా 4 విజయాలతో రచ్చ చేసింది. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. బట్లర్, షారుక్, గిల్ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. బౌలింగ్‌లో సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ ఊపు మీదున్నారు. రషీద్ ఖాన్ గత మ్యాచ్‌లో మ్యాజికల్ స్పెల్‌తో మెరవడం మరో బిగ్ ప్లస్.

బలహీనతలు

లక్నో: కెప్టెన్ రిషబ్ పంత్ ఇంకా ఫామ్‌లోకి రాకపోవడం ఈ టీమ్‌ను ఆందోళన కలిగిస్తోంది. బౌలింగ్‌లో రవి బిష్ణోయ్ భారీగా పరుగులు ఇచ్చుకోవడం మరో వర్రీగా మారింది. ఐదుగురు బౌలర్లనే ఆడిస్తోంది లక్నో. అందులో ఏ ఇద్దరు విఫలమైనా మ్యాచ్ చేజారడం ఖాయం. అందుకే ఈ లోపాల్ని సవరించుకొని బరిలోకి దిగాల్సి ఉంటుంది.

గుజరాత్: ఈ జట్టుకు పెద్దగా బలహీనతలు కనిపించడం లేదు. అయితే తక్కువ వనరులు ఉండటం వల్ల బ్యాటింగ్‌లో ఓ ప్రమాదం కనిపిస్తోంది. బట్లర్, సాయి, గిల్‌లో ఏ ఇద్దరు విఫలమైనా భారీ స్కోరు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లుతాయి. అటు బౌలింగ్‌లో అపోజిషన్ బ్యాటర్లు గనుక అటాకింగ్ మొదలుపెడితే సిరాజ్ అండ్ కో ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తిని కలిగిస్తోంది.

హెడ్ టు హెడ్
ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటివరకు 5 మ్యాచులు జరిగాయి. ఇందులో ఒక దాంట్లో లక్నో, నాలుగింట జీటీ విజయం సాధించాయి.

విన్నింగ్ ప్రిడిక్షన్
లక్నో టీమ్ సక్సెస్ ట్రాక్‌లో ఉంది. బ్యాటింగ్ బలం ఆ జట్టుకు బిగ్ ప్లస్. బౌలర్లకు కూడా సమష్టిగా రాణిస్తున్నారు. హోమ్ గ్రౌండ్‌లో ఆడటం కూడా కలిసొచ్చే అంశం. కానీ భీకర ఫామ్‌లో ఉన్న జీటీ.. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింటా సాలిడ్‌గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *