TGPSC | గ్రూప్ ఫలితాల ప్రకటన షెడ్యూల్ విడుదల !

తెలంగాణలో గ్రూప్ ఫలితాల ప్రకటన షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రకటించింది. గ్రూప్-1, 2, 3 ఫలితాలను ఈ నెల 10 నుండి 18 మధ్య ప్రకటించనున్నట్లు టీజీఎస్పీఎస్సీ తెలిపింది.

టీజీఎస్పీఎస్సీ తాజా షెడ్యూల్ ప్రకారం..

🔹మార్చి 10న గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి, అదే రోజున అభ్యర్థుల ప్రొవిజినల్ మార్కుల వివరాలు కూడా వెల్లడిస్తారు. ఆ తర్వాత, సంబంధిత అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది.

🔹గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చి 11న ప్రకటించ‌నుంది టీజీఎస్పీఎస్సీ.

🔹గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చి 14న ప్రకటిస్తుంది.

🔹హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాలు వరుసగా మార్చి 17, 19 తేదీలలో విడుదల చేయనుంది టీజీఎస్పీఎస్సీ కమిషన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *