ధర్మపురి యువతికి గ్రూపు-2 ఉద్యోగం

ధర్మపురి, ఆంధ్ర‌ప్ర‌భ : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన మానస లక్ష్మి ఇటీవల విడుదలైన గ్రూప్ 2 పరీక్షల్లో ఉద్యోగం సాధించింది. హైదరాబాద్ సెక్రటేరియన్ లో ఏఎస్ఓ గా నియ‌మితుల‌య్యారు. గ‌తంలో రెండు ఉద్యోగాలు సాధించిన ఆమె గ్రూప్‌-2కు ఎంపిక కావ‌డంతో మూడు ఉద్యోగం ల‌భించింది.

గతంలో కూడా మానస లక్ష్మి ఎక్సైజ్ కానిస్టేబుల్ తో పాటు కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగాన్ని పొందారు. ప్రస్తుతం లక్షటిపెట్ లోని డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. వారి తల్లిదండ్రులది లక్షటిపేట మండలంలోని కోటపల్లి గ్రామం. ఆమె తండ్రి కోడూరి గురువయ్య ధర్మపురి లో వ‌స్త్ర‌ వ్యాపారం నిర్వహిస్తూ స్థిరపడ్డారు.

Leave a Reply