పహారి గోడ నిర్మాణానికి భూమి పూజ..

కుంటాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం కోసం శనివారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా రూ.32 లక్షల నిధులు మంజూరు కావడంతో స్థానిక సర్పంచ్ పెంట్వార్ దశరథ్ ఈ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పెంట్వార్ దశరథ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.32 లక్షల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సునీల్ రెడ్డి, మాజీ సర్పంచ్ బండి రమణ గౌడ్, నాయకులు లక్ష్మణ్ పటేల్, గుద్దేటి నర్సయ్య, నవీన్, ప్రశాంత్, ప్రతాప్ రెడ్డి, మక్బూల్, దత్తు, పురుషోత్తం తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.
