మోత్కూర్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి…

మోత్కూర్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి…

గ్రీవిన్స్ లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌లకు వినతి

మోత్కూర్, ఆంధ్రప్రభ : రాబోయే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో మోత్కూర్ ను నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవిన్స్ లో కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి లకు నియోజకవర్గ సాధన సమితి ప్రతినిధులు స్వయంగా అందజేశారు.మోత్కూర్, అడ్డగుడూర్, ఆత్మకూరు (ఎం) ,గుండాల మండలాలతో పాటు మరో మండలాన్ని కలుపుతూ మోత్కూర్ నియోజకవర్గ ఏర్పాటు చేయాలని విన్నవించారు.

పాత రామన్నపేట నియోజకవర్గంలో ని మండలాలు గతంలో చేసిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆయా మండలాలు చిన్నాభిన్నం అయ్యాయని, దీంతో నాలుగు మండలాలలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు.ఇప్పటికే మోత్కూర్ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి. ఇక్కడి ప్రజలు కోర్ట్ పనుల కోసం ,పోస్ట్ మార్టం కోసం కనీసం బస్సు సౌకర్యం కూడా లేని రామన్నపేట కి సుమారు 35 కి.మీ వెళ్లాల్సివస్తుంది. ఇటు రెవెన్యూ పనుల నిమిత్తం సుమారు 40 కి.మీ దూరంలో ఉన్న భువనగిరి కి వెళ్లాల్సి వస్తుంది. గుండాల, ఆత్మకూర్ మండలాల ప్రజలు ఆలేరు, భువనగిరి కోర్టులకు, పోస్ట్ మార్టం కోసం భువనగిరి ఏరియా ఆసుపత్రికి వెళ్తున్నారు.

దీంతో ఇక్కడి ప్రజల సమయం వృధా కావడంతో పాటు, అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. మోత్కూర్ లోనే రెవెన్యూ డివిజన్, కోర్ట్, పోస్ట్ మార్టం, 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే పరిపాలన సౌకర్యవంతంగా మారుతుందని విన్నవిస్తున్నాం. కావున రాబోయే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో మోత్కూర్ ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సాధన సమితి ప్రతినిధులు గుజ్జ సోమనర్సయ్య, ధబ్బేటి సోంబాబు లు ఉన్నారు.

Leave a Reply