శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ప్రమాణస్వీకారం చేయించారు. ఈ రోజు రాజ్‌భవన్ (Raj Bhavan)లోని దర్బార్ హాలులో మధ్యాహ్నం 12.25కు ప్రమాణం చేశారు. కేవలం పది నిమిషాల్లో ప్రమాణాస్వీకార కార్యక్రమం ముగిసింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar), శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhendar Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar goud), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Batti Vikramark) పాల్గొన్నారు. మంత్రిగా ప్రమాణాస్వీకారం అనంతరం అజారుద్దీన్‌కు గవర్నర్, సీఎం తదితరులు శుభాకాంక్షలు చెప్పారు.
అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ రామకృష్ణ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

