Green Land | యూరప్ దేశాల నిర్ణయం ఏమిటో?

Green Land | యూరప్ దేశాల నిర్ణయం ఏమిటో?
- గ్రీన్లాండ్ స్వాధీనానికి సిద్ధపడుతున్న ట్రంప్
- సైనిక చర్యకు సిద్ధమైతే యుద్ధం తప్పదా?
- ఇది మరో ప్రపంచ యుద్ధం కాబోతుందా?
Green Land | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికా అడుగులు ఎటువైపు దారితీస్తాయి? మరో ప్రపంచయుద్ధం కాబోతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. గ్రీన్లాండ్ స్వాధీనానికి అమెరికా దూకుడు(American aggression) పెంచుతుంది. ఈ క్రమంలో గ్రీన్‌లాండ్‌పై సైనిక చర్యకు కూడా సిద్ధపడుతుంది. అమెరికా చర్యలను డెన్మార్క్ ఖండించింది. అది నాటో సైనిక కూటమి అంతమేనని డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్(Danish Prime Minister Mette Frederiksen) హెచ్చరించారు.

నాటో సభ్య దేశంపైనే అమెరికా సైనిక చర్యకు పాల్పడితే యావత్ నాటో వ్యవస్థ(The entire NATO system) కూలిపోతుందని, ఇక ఏమీ మిగలదని ఆమె ప్రకటించారు. గ్రీన్లాండ్ స్వాధీనానికి అమెరికా సైనిక చర్యకు పూనుకుంటే యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. వారికి మద్దతుగా చైనా, రష్యా నిలబడితే ఇక మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని పలువురు భావిస్తున్నారు.
Green Land | గ్రీన్‌లాండ్‌పై అమెరికా దృష్టి ఎందుకంటే..

గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఎందుకు దృష్టి సారిస్తుందో అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో(In international politics) చర్చనీయాంశమైంది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ అయిన వెంటనే ట్రంప్ ఈ గ్రీన్లాండ్ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకు వచ్చారు. గ్రీన్లాండ్ కావాలని ట్రంప్ అంతలా ఎందుకు పట్టుబడుతున్నారు. దాని ప్రాముఖ్యత ఏంటి అనేది ప్రస్తుత చర్చనీయాంశం(Greenland in America). గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేయాలన్నతన పాత కలని ట్రంప్ మళ్లీ బయటపెట్టారు.
రష్యా, చైనాల నుంచి రక్షణ కల్పించడంతో పాటు.. అక్కడి అపారమైన ఖనిజ సంపదను చేజిక్కించుకోవడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. డెన్మార్క్, గ్రీన్లాండ్(Denmark, Greenland) ప్రజలు దీన్ని ఒక దురాక్రమణ ఆలోచనగా పరిగణిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2019లో కూడా ట్రంప్.. ఈ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామని ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించిన సంగతి విదితమే.
Green Land | గ్రీన్ లాండ్ కోసం తెలుసుకుందాం…

డెన్మార్క్ రాజ్యంలో గ్రీన్ లాండ్ స్వయంప్రతి పాలన(Autonomy) కలిగిన ప్రాంతం. విస్తీర్ణం 2,166,086 చదరపు కిలోమీటర్లు ఉంది. జనాభా 57,000. గ్రీన్ లాండ్ వాసులు గ్రీన్లాండిక్, డానిష్, ఇంగ్లీష్ మూడు భాషల్లో మాట్లాడుతుంటారు. ఆ దేశ విదేశాంగ విధానం, రక్షణను పర్యవేక్షిస్తోంది. గ్రీన్ లాండ్ రాజధాని నుక్. భౌగోళికంగా ఉత్తర అమెరికా(Geographically North America)లో భాగం, సాంస్కృతికంగా ఇది యూరప్‌తో అనుసంధానించబడి ఉంది. దాని ప్రజలు తమ మాతృభూమిని కలాలిట్ నునాత్ (గ్రీన్లాండ్ వాసుల దేశం) అని పిలుస్తారు.

2009 నుండి సొంత పార్లమెంట్ (ఇనాట్సిసార్టుట్), ప్రభుత్వం కలిగి ఉంది. ఉత్తర అమెరికా ఖండంలో భాగమైన గ్రీన్లాండ్ తొమ్మిదో శతాబ్దం(Greenland, ninth century) నుంచి యూరప్, ప్రధానంగా నార్వే , డెన్మార్క్‌ల రాజకీయ, సాంస్కృతితో ముడిపడి ఉంది. గ్రీన్లాండ్ బడ్జెట్ ఆదాయంలో మూడింట రెండు వంతుల వాటాను డెన్మార్క్ అందిస్తుంది. ప్రధానంగా చేపల వేటతోపాటు సంభావ్య చమురు, గ్యాస్, అరుదైన భూమి ఖనిజ నిల్వలు(Earth’s mineral reserves) పరిశోధన సంస్థలను ఆకర్షించాయి. గ్రీన్లాండ్ ప్రతి సంవత్సరం రెండు నెలలు నిరంతరం పగటి వెలుతురును అనుభవిస్తుంది. ద్వీపంలో 80% కంటే ఎక్కువ ప్రదేశాలలో 4 కి.మీ. మందపాటి శాశ్వత మంచు కప్పుతో కప్పబడి ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ దీనికి కారణమవుతోంది.
Green Land | ఉద్రిక్తతలు పెంచుతున్న ట్రంప్

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్(President Trump) అడుగులు ప్రపంచంలో అనేక దేశాలు ఖండిస్తున్నాయి. అయినా అమెరికా మాత్రం ఉద్రక్తతలను పెంచుతుంది. అమెరికాతో వెంటనే సమావేశం నిర్వహించాలని గ్రీన్లాండ్, డెన్మార్క్ కోరుతున్నా ట్రంప్ పట్టించుకోవడం లేదు. వెనెజువెలాలో అమెరికా సైనిక జోక్యం(US military intervention) తర్వాత ఆర్కిటిక్‌లోని స్వయం ప్రతిపత్తితో కూడిన డానిష్ ద్వీపం గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ తహతహలాడుతున్నారు.

ఈ క్రమంలో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం(Conquer Greenland) చేసుకోవడం ప్రత్యర్థి దేశాలైన రష్యా, చైనాను నిలువరించడానికి అమెరికాకు జాతీయ భద్రతాపరమైన ప్రాధాన్యతగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అభివర్ణించారు. ఈ ముఖ్యమైన విదేశాంగ విధానం లక్ష్యాన్ని చేరుకునేందుకు అనుసరించాల్సిన భిన్న మార్గాలపై అధ్యక్షుడు, ఆయన బృందం విస్తృతంగా చర్చలు(Extensive discussions) జరుపుతున్నట్లు చెప్పారు.

అయితే ఇందుకోసం అమెరికా సైన్యాన్ని(US Army) ఉపయోగించుకోవడం అధ్యక్షుడికి ఎల్లప్పుడూ ఉండే అవకాశమేనని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని వెంటనే చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Secretary Marco Rubio)ను కోరినట్లు గ్రీన్లాండ్, డెన్మార్క్ అంతకుముందు ప్రకటించాయి. రూబియోను కలిస్తే కొన్ని అపార్థాలు తొలగిపోవచ్చని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లొక్కే రస్ముస్సెన్(Minister Lars Lokke Rasmussen) పేర్కొన్నారు. తమ ద్వీపం అమ్మకానికి లేదని, దాని భవిష్యత్తును గ్రీన్లాండ్ పౌరులే నిర్ణయిస్తారని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సెన్ పునరుద్ఘాటించారు.

గ్రీన్లాండ్ సార్వభౌమత్వాన్ని, సరిహద్దు(Greenland’s sovereignty and borders) సమగ్రతను సమర్థిస్తామంటూ డెన్మార్క్‌కు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలాండ్, స్పెయిన్ సంఘీభావం తెలియచేస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఐరోపా దేశాల నాయకులకు సోషల్ మీడియా వేదికగా నీల్సెన్(Nielsen) కృతజ్ఞతలు తెలిపారు.
