యాత్ర అద్భుతం..
సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): అక్టోబర్ 6న సంగారెడ్డి (Sangareddy) నవరత్నాలయ దేవస్థానం నుండి సాహితీ రాము గురు స్వామి ఆధ్వర్యంలో తిరుపతి, కాణిపాకం, అరుణాచలం, శబరిమలకు మహా పాదయాత్రగా బయలుదేరిన స్వాములు తిరుమల చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తి చేసుకుని కాణిపాకం, అరుణాచలం మీదుగా శబరిమల వరకు పాదయాత్ర కొనసాగుతుందని సాహితీ రాము స్వామి తెలిపారు.
ఇప్పటి వరకు పాదయాత్ర 700 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని తెలిపారు. యాత్ర అద్భుతంగా కొనసాగుతుందని స్వాములు ఉత్సాహంగా నడుస్తున్నారని సంగారెడ్డి గురు స్వాములు, మాత స్వాముల ఆశీస్సులు కావాలని రాము స్వామి తెలిపారు.

