Telangana | గ్రీజర్లు ఏర్పాటు చేయాలి
Telangana | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, సంక్షేమ వసతి గృహాల్లో గ్రీజర్లు ఏర్పాటు చేయాలని ABSF, TDVV సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి (Sandhya Rani) కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ABSF, TDVV నాయకులు బట్టు సాంబయ్య, బోట్ల నరేష్ మాట్లాడుతూ… వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, సంక్షేమ వసతి గృహాల్లో చలి తీవ్రతతో గురుకుల పాఠశాలలో, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు (students) ఉదయం పూట చల్లని వాటర్ తో స్నానం చేయడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. చలి తీవ్రత నుండి విద్యార్థులకు విముక్తి కల్పించే విధంగా అన్ని గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో గ్రీజల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా కోరారు.

