ఘ‌నంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు..

ఘ‌నంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు..

గజ్వేల్, ఆంధ్ర ప్రభ : గ్రామీణ ప్రాంత వాతావరణంలో చక్కటి విద్యాబోధన అందిస్తూ సమాజానికి అత్యుత్తమ డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యావేత్తలు, పరిశోధక విద్యార్థులను అందించిన ఘనత సెయింట్ మేరీస్(Saint Mary’s) యాజమాన్యానికి దక్కుతుందని ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరి యాదవ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజ్ఞాపూర్ లోని సెయింట్ మేరీస్ విద్యాలయంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు, బాల శాస్త్రవేత్తలు రూపొందించిన ఎగ్జిబిషన్ ను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఈ రోజు ఆయన ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ.. సెయింట్ మేరీస్ పాఠశాలలో గురువులు విలువలతో కూడిన విద్య, క్రమశిక్షణ, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి సమాజానికి అందిoచి భావి భారత పౌరులుగా(future citizens of India) తీర్చిదిద్దగా, ప్రస్తుతం వందలాదిమంది విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉన్నట్లు గుర్తు చేశారు. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అమలు చేసిన విద్యాహక్కు చట్టం వంటి విద్యాభివృద్ధి పథకాలు అమలు చేయగా, నామమాత్రపు రుసుముతో విద్యనందించిన ఘనత దక్కించుకున్నట్లు తెలిపారు.

భిన్నత్వంలో ఏకత్వం, విద్యార్థుల పరివర్తన, నూతన సాంకేతికత దిశగా దృష్టి పెట్టిన సెంటిమెరిస్ యాజమాన్యం ఉమ్మడి మెదక్ జిల్లా(Medak District)లోనే ఉన్నత విద్యా సంస్థగా పేరు తెచ్చుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం వంటి పథకాలకు చేయూతనందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి, మండల విద్యాధికారి కృష్ణ, ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ రెడ్డి(Someshwar Reddy) తదితరులు పాల్గొన్నారు.

అనంతరం రాష్ట్రంలోనే ఉత్తమ డీఈవోగా అవార్డు పొందిన సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. కాగా మొదటగా హిందూ సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ విద్యార్థులు వివిధ ప్రదర్శనలివ్వగా, వేద పండితులు హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు.

Leave a Reply