ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్

ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్

  • చైతన్య మోడల్ హైటెక్ పాఠశాల

పరకాల, ఆంధ్రప్రభ: పరకాల పట్టణంలోని చైతన్య మోడల్ హైటెక్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.

శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్, విద్యావేత్త డా. సిరికొండ శ్రీనివాసాచారి, ప్రధానోపాధ్యాయులు వీణవంక రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పరకాల మున్సిపాలిటీ బీజేపీ 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్, 15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

కార్యక్రమానికి హాజరైన కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ సుమారు 50 మంది విద్యార్థులకు ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్లను బహుమతిగా అందజేశారు.

Leave a Reply