ఖానాపూర్ రూరల్, (ఆంధ్రప్రభ) : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామంలో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక ఆకర్షణగా భక్తులు రూ. 8 లక్షల 50 వేల విలువైన కరెన్సీ నోట్లతో మహామాలను సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఘనంగా ఉత్సవాలు…

