ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని తిప్పనగుల్ల(Turn around) గ్రామంలో ఈ రోజు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాహాసిల్దార్ శ్రీనివాస్(Tehsildar Srinivas) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటించాలని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.

ప్రభుత్వం(Government) వరి ధాన్యానికి ఏ గ్రేడ్ ధర 2,389, బి గ్రేడ్ ధర 2,369(A grade price 2,389, B grade price 2,369), కేటాయించడం జరిగిందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం అశోక్(APM Ashok), కార్యదర్శి శ్యామల, సెంటర్ నిర్వాహకులు మమత, లావణ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply