గుంటూరు ఆంధ్రప్రభ – కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తొలి రౌండ్ ముగిసే నాటికి సుమారు 9.980 ఓట్ల ఆధీక్యంలో కొనసాగుతున్నారు. 28 టేబుళ్ళ లో మొదటి రౌండులో 28,312 ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి చెల్లుబాటు అయిన ఓట్లు 25242 . ఇక వాటిలో మొదటి రౌండ్‌లో ఆలపాటి రాజాకు 17, 194 ఓట్లు పోల్ కాగా, అతని సమీప ప్రత్యర్ధి, పిడిఎఫ్ కు చెందిన కె.ఎస్.లక్ష్మణరావుకు 7,214 ఓట్లు ఓట్లు వచ్చాయి. ఇక తొలి రౌండ్ లో సుమారు 3070 ఓట్లు చెల్లకుండా పోవడం విశేషం..
స్వల్ప ఆధీక్యంలో పిఆర్టీయు అభ్యర్ధి…
ఇక ఏపీలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ముగ్గురు అభ్యర్థులు నువ్వానేనా అనేరీతి ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సరళిలో.. తొలిరౌండ్ ముగిసే సమయానికి త్రిముఖ పోటీలో ముగ్గురు అభ్యర్థులు నువ్వానేనా అనేరీతితో ఆధిపత్యంలో దూసుకు పోతున్నారు. ఈ స్థానానికి మొత్తం 19813 ఓట్లు పోలయ్యాయి.. ఇందులో పి అర్ టి యూ అభ్యర్ధి గాదె శ్రీనివాసులు నాయుడుకి 7150 ఓట్లు పోలయ్యాయి. ఇక ఆయన సమీప ప్రత్యర్థి ఏపిటిఎఫ్,కూటమి మద్దతు ఇచ్చిన పాకలపాటి రఘు వర్మకు 6790 ఓట్లు వచ్చాయి.. ఇక యూటిఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కే.విజయ గౌరీ 5873 ఓట్లు లభించాయి.. తొలి రౌండ్ లో పి అర్ టి యూ అభ్యర్ధి గాదె శ్రీనివాసులు నాయుడు తన సమీప అభ్యర్ధి పాకలపాటి రఘువర్మకంటే 360 ఓట్ల ఆధీక్యంలో ఉన్నారు.. ఓట్ల లెక్కింపు నిబంధన ప్రకారం ఏ ఒక్క అభ్యర్ధికి పోలైన ఓట్లలో 50 శాతం రాలేదు.. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.
కాగా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో పది మంది అభ్యర్థులు ఉన్నారు. కోసూరు రాధాకృష్ణ, పాకలపాటి రఘువర్మ, సత్తలూరి శ్రీరంగ పద్మావతి, కోరెడ్ల విజయ గౌరీ, నూకల సూర్యప్రకాశ్, రాయల సత్యనారాయణ, గాదె శ్రీనివాసులు నాయుడు, పోతల దుర్గారావు, పెదపెంకి శివప్రసాద్, సుంకర శ్రీనివాసరావు లు పోటీ పడుతున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 3 ఎమ్మెల్సీ స్థానాలకూ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానిది ఏలూరు సమీపంలోని వట్లూరు సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కాలేజీలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. ఉమ్మడి తూర్పు-పశ్చిమగోదావరి పట్టభద్రుల స్థానానికి అత్యధికంగా 35 మంది, కృష్ణా-గుంటూరు స్థానానికి 25 మంది, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి పదిమంది పోటీలో ఉన్నారు. ఇక, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి పట్టభద్రుల నియోజకవర్గాల్లో 63.28 శాతం, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాల్లో 65.58 శాతం, శ్రీకాకుళం –విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 91.82 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలోనూ ఎన్నికల రసవత్తరంగా జరిగింది. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో మొత్తం 35 మంది బరిలో ఉన్నారు. వీరిలో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థి డీవీ రాఘవులు, స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ పోటీపడ్డారు. ప్రస్తుతం ఇక్కడ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్ది,