ప్రభుత్వ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
కొమురవెల్లి, ఆంధ్రప్రభ : కొమురవెల్లి మండల కేంద్రంలోని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగ్రవాల్(Garima Agrawal) పిహెచ్సి(Ph.C)ని తనిఖీ చేసి హాజరు, ఓపి రిజిస్టర్లు(OP Registers), మందుల ధృవీకరణ రిజిస్టర్లను పరిశీలించారు. రోగులతో సంభాషించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో నమోదైన డెంగ్యూ కేసుల(dengue cases) వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు(medical equipment), మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.

