Govt Funds | కార్యదర్శికి వినతి పత్రం అందజేత
Govt Funds | మునుగోడు, ఆంధ్రప్రభ : మండలంలోని పలివెల గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం పై గ్రామపంచాయతీ కార్యదర్శికి ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఈ రోజు వినతి పత్రం అందజేశారు.
అనంతరం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ… గత ఐదు సంవత్సరాల కాలంలో 15 వ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వ నిధులు(Central Govt Funds), స్టేట్ ఫైనాన్స్ నుంచి వచ్చిన స్పెషల్ గ్రాండ్ నిధులు సుమారు రూ. కోటి 70 లక్షలు(Rs. 1 crore 70 lakhs) వాటి ఖర్చులు లిఖితపూర్వకంగా అందజేయాలని, వాటిపై గ్రామస్తులకు పలు అనుమానాలు ఉన్నట్లు తెలిపారు.
గ్రామస్తుల అనుమానాలు తీర్చడానికి తగిన వివరణ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెరుకు సునిత, వార్డు మెంబర్లు కొండూరి మాధవి,బత్తుల వెంకన్న, ఆనగంటి కృష్ణ,బత్తుల ప్రవీణ్,గోసుకొండ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

