Govt | నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలి..

Govt | నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలి..

  • జిల్లా విద్యాశాఖ అధికారి.

Govt | మైలవరం, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారిణి చంద్రకళ ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం స్థానిక లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి పది పరీక్షల సన్నద్ధం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చునని ఉద్బోదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వంద రోజులు విద్యార్థులకు ఎంతో కీలకమైనవని, సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు.

అనంతరం ఉపాధ్యాయులతో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ యాక్షన్ ప్లాన్ కి అనుగుణంగానూటికి ప్రతి విద్యార్థిపై ప్రేత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బండి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply