Govt | గంట ముందస్తు వెసులుబాటు…

Govt | గంట ముందస్తు వెసులుబాటు…
- సీఎం చంద్రబాబుకి, మైనారిటీ మంత్రి ఫరూక్కి, కృతజ్ఞతలు…
Govt | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 16 నుంచి మార్చి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ముస్లిల ఉద్యోగులకు ప్రార్ధనల నిమిత్తం సాయంత్రం పనివేళం ముగింపుకు ఒక గంట ముందుగానే వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జార్ చేసినట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ గురువారం తెలిపారు.
ఈ వెనులుబాటు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల సిబ్బంది సహా అన్ని ప్రభుత్వ ప్రైవేటు శాఖల్లో విధులు నిర్వహించే ముస్లిం ఉద్యోగులందరికీ వర్తిస్తుందని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
అత్యవసర పరిస్థితులు మినహా, రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులు తమ మతపరమైన ఆచారాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించుకునేలా మానవతా పరమైన నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయక్ ముస్లింల పక్షపాతి అని నిరూపించుకున్నడని టీడీపీ సీనియర్ నాయకులు నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్ పేర్కొన్నారు.
మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వారి భావోద్వేగాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ నిర్ణయాన్ని ప్రభుత్వస్థాయిలో అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరుక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఎండి ఫిరోజ్ లు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేశారు. రంజాన్ మానంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మైనారిటీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు.
