Govt | సరిహద్దులు తెలుపాలని ఎమ్మార్వోకు బీజేపీ వినతి

Govt | సరిహద్దులు తెలుపాలని ఎమ్మార్వోకు బీజేపీ వినతి

Govt | ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి గ్రామ సరిహద్దులను స్పష్టంగా తెలుపాలని కోరుతూ మండల బీజేపీ నాయకులు స్థానిక ఎమ్మార్వో అనిల్ కుమార్ కి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఇటీవల నూతనంగా ఏర్పడిన ఎండపల్లి మండలానికి అవసరమైన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన స్థలాల గుర్తింపు కోసం గ్రామ సరిహద్దుల స్పష్టత అవసరమని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలు, మండల స్థాయి భవనాలు, ఇతర మౌలిక వసతుల ఏర్పాటుకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలంటే గ్రామ హద్దులు ఖచ్చితంగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని వారు ఎమ్మార్వో అనిల్ కుమార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రోజు శ్రీనివాస చారి, మామిడిపల్లి రమేష్, వోజ్జల నాగరాజు, మంచికట్ల మహేందర్, సామల రవి, దాసరి మల్లేష్ యాదవ్, తబల హరీష్, బైకని రాజ్ కుమార్ యాదవ్, ఇప్ప రాజేషం, రేగుంట అంజయ్య, దేవి సంతోష్ కుమార్ తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply