Govt | మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Govt | మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Govt | జైనూర్, ఆంధ్రప్రభ : స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జైనూర్ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు అన్నారు. ఈ రోజు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)మండలంలోని రాఘాపూర్ గ్రామంలో గ్రామైక్య స్వయం సహాయక సంఘం కోసం నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఇందిరా క్రాంతి పథకం పొదుపు సంఘాల మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా ఎస్ హెచ్ జీ గ్రూప్ సభ్యులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాశ్వత భవనాలు నిర్మించాలన్న సదాశయంతో ఒక్కో భవనం కోసం రూ.10 లక్షలు మంజూరు చేశారని తెలిపారు.

మండలంలో మొత్తం 13 భవనాలకు రూ. 1.30 కోట్లు మంజూరు చేశారని వివరించారు. పనులు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కృష్ణారావు, స్థానిక సర్పంచ్ ఆత్రం విజయలక్ష్మీ భిర్సావ్, ఎంపీడీవో కృష్ణారావు, ఎంపీఓ ప్రమోద్, ఏఈ ప్రశాంత్, ఎ పి ఎం రమేష్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply