Govt | విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు

Govt | విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి..
షేర్ మహమ్మద్‌పేట ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

Govt | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట మండలం, షేర్ మహమ్మద్‌పేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, వంటశాల, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి స్వయంగా భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. భోజనం రుచి, పరిశుభ్రత, పోషక విలువలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ… రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందేలా ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందన్నారు.

Govt |

ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం స్కీం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు చదువుపై ఆసక్తి పెంచేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

Govt |

విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే వారు చదువులో మెరుగైన ఫలితాలు సాధించగలరని అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీ సమయంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, మెనూ ప్రకారం పోషకాహారం వండి విద్యార్థులకు సమయానికి అందించాలని వంట సిబ్బంది సంబంధిత అధికారులకు సూచించారు. పిల్లల ఆరోగ్యం, చదువు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

Govt |

అలాగే పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాల గురించి ఉపాధ్యాయులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సక్రమంగా చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ప్రోత్సహించారు. విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని, వారికి ఉత్తమ విద్యా వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

Govt |

అనంతరం విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపి వారి చదువులు, భవిష్యత్తు లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply