కోమటి జయరామ్‌కు ఎమ్మెల్యే అభినందనలు…

కోమటి జయరామ్‌కు ఎమ్మెల్యే అభినందనలు…
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రవాస భారతీయుడు కోమటి జయరామ్ ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అభినందించారు. ఉత్తర అమెరికా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరామ్ ఆత్మీయ సత్కార కార్యక్రమం నగరంలోని మురళి రిసార్ట్స్ లో శనివారం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో కోమటికి ఎమ్మెల్యే వసంత శుభాకాంక్షలు తెలిపారు.
అమెరికాలో టీడీపీ పతాకాన్ని సగౌరవంగా, సగర్వంగా ఎగురవేసి తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి దశాబ్దాలుగా కృషి చేస్తున్న తెలుగు వెలుగుల మేటి కోమటి జయరామ్ అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉత్తర అమెరికాలో తెలుగు వారి సంక్షేమానికి మరింత పాటుపడగలరని ఆకాంక్షించారు.

కోమటికి చిట్టిబాబు అభినందనలు…
ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సత్సంబంధాలు మరింత బలపడేలా కోమటి జయరామ్ కృషి చేస్తారని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తర అమెరికా ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరామ్ కు శనివారం పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, అలాగే ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారంలో ఆయన కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు.
