ప్రజాపాలన ప్రభుత్వంలో..

ప్రజాపాలన ప్రభుత్వంలో..
సొంతింటి కల నెరవేరిన వేళ..
ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం…
బూర్గంపాడు, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రభుత్వంలో నిరుపేదలకు సొంతింటి కల ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా నెరవేరిందని స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం భూర్గంపాడు మండల పరిధిలోని నగిరి పేట పంచాయతీ నగిరిపేట గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారిని సోంది నందిని ఇందిరమ్మ గృహాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అర్వత కలిగిన ప్రతి నిరుపేదకు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇళ్లు లు మంజూరు అవుతాయని విడుదలవారీగా ప్రతి ఒక్కరికి అందుతాయని గుర్తు చేశారు.
పథకం ప్రవేశపెట్టి పేదవాడి ఆత్మీయ గౌరవాన్ని నిలబెట్టే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.మొదటి విడత గా పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా 4,500 ఇల్లు మంజూరు చేశామని మార్చి నాటికి బూర్గంపాడు మండలంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. ఏప్రిల్ నెల నుండు రెండో విడతలో ఇల్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. అన్ని పంచాయతీలో మౌలిక వసతులతో పాటు అభివృద్ది పనులు వేగవంతం అవుతున్నాయని,అదేవిధంగా రైతులకోసం సాగు నీరు దోమలవగు కు నీరు అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి జమలారెడ్డి, హౌసింగ్ ఏఈ ఉదయ్ కిరణ్, జిపిఓ స్వాతి, నగిరి పేట సర్పంచ్ చరప నాగమణి, వ్యవసాయ శాఖ అధికారి శంకర్, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేష్ రెడ్డి, పలు గ్రామపంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.
