Govindh l 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత గోవింద్ రావు

Govindh l 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత గోవింద్ రావు

రైటప్: ఓటరు మద్దతు కోరుతున్న 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు

Govindh l మక్తల్ , ఆంధ్రప్రభ: మున్సిపల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో 13వ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని తనను ఆదరించి ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సరిత గోవింద్ రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వార్డు పరిధిలో తన మద్దతుదారులతో కలిసి విస్తృతంగా ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగించారు. ప్రతి ఇంటికి వెళ్లి తనను ఆదరించాలని ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు మన వార్డును అందమైన వార్డూగా తీర్చిదిద్దుకుందాం అందుకు మీరంతా సహకరించాలి ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి తనను కౌన్సిలర్గా గెలిపించాలి అని కోరారు. వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని అన్నారు. ప్రతి గల్లీలో సీసీ రోడ్లు మురుగు కాలువల నిర్మాణం చేపడతానన్నారు. అదేవిధంగా త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పారు. వీధిలైట్లు ఇతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తనను ఆదరించి 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి మున్సిపల్ కౌన్సిలర్ గా తనను గెలిపించాలని సరిత గోవింద్ రావు విజ్ఞప్తి చేశారు .ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు ఫయాజ్, రమేష్ రావు, సాగర్ అయ్య ,సురేంద్ర చారి పెద్ద ఎత్తున మహిళలు మద్దతుదారులు పాల్గొన్నారు.

Leave a Reply