కావేరి యూనివర్సిటీని సందర్శించిన గవర్నర్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కావేరి యూనివర్శిటీని సందర్శించారు. కావేరి యూనివర్సిటీ ఉపకులపతి వెల్చాల ప్రవీణ్ రావు, అధికారులు గవర్నర్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఏఐ, ఎంఎల్ ల్యాబ్, ఎంటమాలజీ ల్యాబ్, సాయిల్ హెల్త్ ల్యాబ్లను సందర్శించారు. కావేరి సీడ్స్, కావేరి యూనివర్సిటీ, కావేరి రీఛార్జ్ రిసర్చ్ సెంటర్, కావేరి సీడ్స్ కంపెనీ ఆవరణలో పోలీస్ కమిషనర్ ఎస్. యం. విజయ్ కుమార్, ఐపిఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం గవర్నర్ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.

