ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి మొదలు కానున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శుక్రవారం విడుదల చేశారు. సెప్టెంబర్ 18 ఉదయం 9 గంటలకు శాసనసభ, అదే రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది.
గవర్నర్ నోటిఫికేషన్ జారీ !!

