శాసన సభ స్పీకర్ ను కలిసిన ప్రభుత్వ విప్

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వ విప్ గా నియామకమైన సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply