Shakti | మహిళలకు అండగా ప్రభుత్వం

Shakti | మహిళలకు అండగా ప్రభుత్వం


గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి…


Shakti | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మహిళలకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం బిక్కనూర్ మండలం సిద్ధిరామేశ్వర నగర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరా శక్తి (Indira Shakti) చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కోటి మహిళలను కోటీశ్వరులుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి మహిళా గ్రామ సంఘంలో సభ్యురాలుగా ఉండాలని తెలిపారు. గ్రామ సంఘాల అభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందన్నారు.

బ్యాంకుల ద్వారా తీసుకుంటున్న రుణాలతో పలు వ్యాపారాలు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. మహిళలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, ఐకెపిసిసి గంగల జయశ్రీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply