TG | ట్రైనీ ఐఏఎస్‌లకు పోస్టింగ్స్.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !

రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కొత్త కీలక మార్పు చోటు చేసుకుంది. విస్తృత శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఐఏఎస్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్రంలో 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ట్రైనీలకు పోస్టింగ్‌లు ఖరారయ్యాయి. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA), మసూరీ లో ప్రొఫెషనల్ కోర్స్ ఫేస్-2 శిక్షణ పూర్తి చేసిన తర్వాత వీరిని సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఆర్.టి నెం.972 ప్రకారం, ఈ ఐఏఎస్ అధికారులను వివిధ జిల్లాల్లో సబ్ కలెక్టర్లుగా నియమించారు.

తాజాగా ఖరారైన పోస్టింగ్‌ల ప్రకారం:

  • ఉమ హారతి ఎన్. – సంగారెడ్డి జిల్లా, నారాయంకేడ్ సబ్ కలెక్టర్‌గా
  • అజ్మీరా సంకేత్ కుమార్ – నిర్మల్ జిల్లా, భైన్సా సబ్ కలెక్టర్‌గా
  • అభిజ్ఞాన్ మాల్వియా – నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ సబ్ కలెక్టర్‌గా
  • అజయ్ యాదవ్ – ఖమ్మం జిల్లా, కల్లూరు సబ్ కలెక్టర్‌గా
  • మృణాళ్ శ్రేష్ఠ – భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా, భద్రాచలం సబ్ కలెక్టర్‌గా
  • మనోజ్ – మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లిలో సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.

సంబంధిత కలెక్టర్లు, జిల్లా కలెక్టర్‌-మ్యాజిస్ట్రేట్లు వీరి నియామకానికి అవసరమైన చర్యలు తీసుకుని, సబ్ కలెక్టర్లు ఏ రోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారో ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇక పై ఈ ఐఏఎస్‌లు కొత్తగా నియమిత స్థానాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యతను భుజాల మీద వేసుకున్నారు. జిల్లాలో పరిపాలన మరింత చురుకుగా కొనసాగేలా వీరి సేవలు ఉపయోగపడుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Leave a Reply