దుష్ప్రచారాల‌పై కూట‌మి క‌న్ను..

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా దుష్ప్రచారంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం అవసరమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. అనిత, నాదెండ్ల మనోహర్, పార్థసారధి, అనగాని సత్యప్రసాద్‌లతో కూడిన ఈ ఉపసంఘం కొత్త చట్టాల రూపకల్పనపై చర్చించనుంది.

సోషల్ మీడియా పోస్టులకు ఆధార్ ఆధారిత బాధ్యత (Aadhaar accountability) ఉండేలా చట్టం తీసుకురావాలన్న అంశంపైనా సీఎం చర్చించారు.

కఠిన చర్యలు తప్పవు..

మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, తప్పుడు పోస్టులు పెట్టేవారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని ప్రస్తావించిన సీఎం, ఆమె కుటుంబానికి అండగా ఉన్నందుకు తనపై దుష్ప్రచారం జరుగుతోందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు.

అలాగే రాష్ట్రంలో ఎరువుల కొరత లేనప్పటికీ, వైసీపీ నేతలు యూరియాపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సరైన సమయంలో ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, ఇకపై ఇలాంటి దుష్ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులను హెచ్చరించారు.

Leave a Reply