ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతు సంఘం ఆధ్వర్యం లో స్టేషన్ ఘన్ పూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ సోమవారం రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి లింగబోయిన కుమారస్వామి హాజరై తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి గా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు.
రైతు భరోసా నిధుల విడుదలలో ఆలస్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లేక పోవడం, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం ఇవి ప్రభుత్వ వైఫల్యాలేనని విమర్శించారు. జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నప్పటికీ బాధ్యులపై చర్యలు తీసు కోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ, అటవీ భూములపై సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించాలని, పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఎరువుల కొరత, మార్కెట్‌లో మధ్యవర్తుల దోపిడీ రైతాంగాన్ని మరింత కష్టాల్లోకి నెడు తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతు సమ స్యలను పరిష్కరించకపోతే తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉధృతమైన పోరాటాలకు శ్రీకారం చుడతామని ఘాటు గా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మంద మొగిలి, దాసరి కొమురయ్య ,బక్క అశోక్, కత్తుల సంపత్, తదితరులు పాల్గొన్నారు.
