KISAN | రైతన్న సేవలో ప్రభుత్వం

KISAN | రైతన్న సేవలో ప్రభుత్వం
ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
నందమూరు గ్రామంలో ధాన్యం కొనుగోళ్లపై ఆరా
KISAN | పెడన, ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం పెడన మండలం నందమూరు గ్రామంలో రైతన్న “రైతన్న మీకోసం” కార్యక్రమంలో పాల్గొన్న పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గ్రామంలో రైతుల ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలోముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లపై ఆరా అరతీసి అనంతరం పశువుల ఆసుపత్రి సందర్శించారు. ఎమ్మెల్యే (MLA) మాట్లాడుతూ.. సాగు భూమి ఉన్న భూ యజమాని రైతు కుటుంబాలకు, అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు సంవత్సరానికి రూ.20 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు.
ఆగస్టు 2, 2025న మొదటి విడతగా 46,85,838 రైతుల ఖాతాల్లో రూ.3174.43 కోట్లు (కేంద్ర, రాష్ట్ర నిధులు) జమ చేశాం. రెండో ఎడతగా నవంబరు 19, 2025న 46,85,838 రైతుల ఖాతాల్లో రూ. 3135.01 కోట్లు (కేంద్ర , రాష్ట్ర నిధులు) జమ చేయడం జరిగిందన్నారు.
రైతులకు సబ్సిడీ పై వ్యవసాయ పనిముట్లను (Agricultural implements) అందించడం 2025–26లో రూ. 164.158 కోట్ల రాయితీ నిధులతో రైతులకు పనిముట్లు పంపిణీ, రూ.80 కోట్ల రాయితీ నిధులతో 80% రాయితీపై 1000 కిసాన్ డ్రోన్‌లతో కూడిన గ్రామస్థాయి వ్యవసాయ యంత్రాల బ్యాంకులను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
ఖరీఫ్ 2024 లో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని (Metric tons of grain) 6 లక్షల మంది రైతుల నుంచి 8282కోట్లతో కొనుగోలు చేశాం. 24 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేశాం. అలాగే రబీ 24-25 లో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.4,575 కోట్లు చెల్లించామన్నారు. బాల బాలికల ఆరోగ్యం దృష్ట్యా స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
