అక్రమ మట్టి తరలిస్తున్న 6 గురి పై కేసు నమోదు

అక్రమ మట్టి తరలిస్తున్న 6 గురి పై కేసు నమోదు

గీసుగొండ, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా గీసుగొండ మంద్ఫలంలోని చంద్రయ్యపల్లి గ్రామ శివారులో అక్రమంగా మట్టిని ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్చగా మట్టి తవ్వకాలు జరుపుతున్న ఒక జేసీబీతో పాటు ఆరు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గీసుగొండ సిఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం చంద్రయ్యపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి నుండి కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి, నిందితులపై కేసులు నమోదు చేశారు. నిందితుల వివరాలు: ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి:

గండికోట సతీష్ (మనుగొండ) గాడుదుల రాజకుమార్ (మనుగొండ) గాడుదుల శ్రావన్ కుమార్ (మహేశ్వరం, నర్సంపేట) కుప్పాల శ్రీనివాస్ (చంద్రయ్యపల్లి) కుప్పాల అజయ్ (చంద్రయ్యపల్లి) తోట పరుషరాములు (మనుగొండ) గాడుదుల బాలారాజు (మనుగొండ)”ప్రభుత్వ సంపదను అక్రమంగా తరలిస్తే సహించేది లేదు. అనుమతులు లేకుండా మట్టి, ఇసుక తవ్వకాలు జరిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ అన్నారు.

Leave a Reply