Gopuja | గోరంట్లలో గోశాల ప్రారంభం

Gopuja | గోరంట్లలో గోశాల ప్రారంభం

Gopuja | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : గోరంట్ల మండలంలోని గుమ్మయ్య గారిపల్లి గ్రామంలో ఈ రోజు నూతన గోశాలను ప్రారంభించారు. గ్రామంలోని మారెమ్మ దేవాలయం (Maremma Temple) సౌజన్యంతో విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో ఈ గోశాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరి గోపూజ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వచ్చిన బీజేపీ శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు జీఎం.శేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గోమాత దేశ సంస్కృతిలో అతి ముఖ్యమైన స్థానం కలిగి ఉందని, సంప్రదాయ వ్యవసాయ విధానాల్లోనూ, పర్యావరణ పరిరక్షణలోనూ గోవుల పాత్ర అపారమని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా హిందూ బంధువులు దాదాపు వందల సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గోపూజ తర్వాత గోశాల ప్రాంగణంలో దాతల చేతుల మీదుగా పశువులకు (cattle) మేత పంపిణీ జరిగింది. భవిష్యత్తులో గోశాల విస్తరణ, అదనపు సౌకర్యాల అభివృద్ధి కోసం గ్రామ పెద్దలు, భక్తులు తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో దేవి స్వామి, విశ్వవిందుపరిషత్ ప్రముఖులు, భక్తజనులు, గ్రామస్థులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం అన్నదానం నిర్వహించగా కార్యక్రమం భక్తి–భావపూర్వక వాతావరణంలో ముగిసింది.

Leave a Reply